Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

టెలికం వినియోగదారుల హక్కులపై అవగాహన

Author
Posted By CHEEKATI VELUGU
| 25 Sep 2026, 02:36 PM | TELANGANA
టెలికం వినియోగదారుల హక్కులపై అవగాహన

సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తతే రక్షణ.. 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలి

చీకటి వెలుగు, నల్గొండ, సెప్టెంబరు 25:
టెలికం వినియోగదారుల హక్కులు, సేవలు, సైబర్‌ మోసాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ట్రాయ్‌ ఆధ్వర్యంలో నల్గొండలోని కాకతీయ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

టెలికం వినియోగదారుల హక్కులపై అవగాహన - Additional Image

డ్రగ్స్‌ పార్సిల్‌ పేరుతో మోసాలు, కుటుంబ సభ్యుల పేరుతో ఏఐ రూపొందించిన ఆడియో, వీడియోల ద్వారా మోసాలు, ఇన్‌స్టాగ్రామ్‌ లింకులు, పెట్టుబడుల పేరుతో జరిగే సైబర్‌ మోసాలపై నల్గొండ సీఐ రాజశేఖర్‌రెడ్డి అవగాహన కల్పించారు. ఆర్థిక మోసం జరిగిన వెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

ట్రాయ్‌ అధికారులు వినియోగదారుల హక్కులు, టెలికం ఫిర్యాదుల పరిష్కారం, సేవల నాణ్యత, అవాంఛిత కాల్స్‌ నియంత్రణపై వివరించారు. టెలికం సేవల నాణ్యత, వేగం తెలుసుకోవడంతో పాటు అవాంఛిత కాల్స్‌ను నియంత్రించేందుకు ‘మై కాల్‌’, ‘మై స్పీడ్‌’, ‘డీఎన్‌డీ’ యాప్‌లను వినియోగించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎం సిబ్బంది, టెలికం వినియోగదారులు, అధికారులు, టెలికం సంస్థల ప్రతినిధులు, వినియోగదారుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.