టెలికం వినియోగదారుల హక్కులపై అవగాహన

సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తతే రక్షణ.. 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలి చీకటి వెలుగు, నల్గొండ, సెప్టెంబరు 25: టెలికం వినియోగదారుల హక్కులు, సేవలు, సైబర్‌ మోసాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ట్రాయ్‌ ఆధ్వర్యంలో నల్గొండలోని కాకతీయ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్‌ పార్సిల్‌ పేరుతో మోసాలు, కుటుంబ సభ్యుల పేరుతో ఏఐ రూపొందించిన ఆడియో, వీడియోల ద్వారా మోసాలు, ఇన్‌స్టాగ్రామ్‌ లింకులు, పెట్టుబడుల పేరుతో జరిగే సైబర్‌ మోసాలపై నల్గొండ సీఐ రాజశేఖర్‌రెడ్డి అవగాహన కల్పించారు. ఆర్థిక మోసం జరిగిన వెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ట్రాయ్‌ అధికారులు వినియోగదారుల హక్కులు, టెలికం...