Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పేద విద్యార్థుల ఆశాకిరణం ఆర్. కృష్ణయ్య

Author
Posted By CHEEKATI VELUGU
| 13 Sep 2026, 04:20 PM | Uncategorized
పేద విద్యార్థుల ఆశాకిరణం ఆర్. కృష్ణయ్య


చీకటి వెలుగు నలగొండ



నల్గొండ జిల్లా కేంద్రం: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, పేద విద్యార్థుల విద్య, నిరుద్యోగుల హక్కుల కోసం గత ఐదు దశాబ్దాలుగా నిరంతరం పోరాడుతున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్. కృష్ణయ్య గారి జన్మదిన వేడుకలను నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఆర్. కృష్ణయ్య గారు చేసిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుకు ప్రభుత్వంపై పోరాటం చేసి సాధించడంలో, అలాగే సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు వంటి విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేయడంలో ఆర్. కృష్ణయ్య గారి పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ఆయన పోరాటాల ఫలితంగా వేలాది మంది పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యావకాశాలు లభించాయని పేర్కొన్నారు.



“పదవి కోసం కాదు.. పేదల కోసం పోరాటం” అనే స్ఫూర్తితో ఐదు దశాబ్దాలుగా సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్న ఆర్. కృష్ణయ్య గారు బీసీ వర్గాలకు మాత్రమే కాకుండా పేదలు, విద్యార్థులు, నిరుద్యోగులకు స్ఫూర్తిదాయక నాయకుడిగా నిలిచారని జనార్దన్ గౌడ్ కొనియాడారు.

ఇవి కూడా చదవండి



ఆర్. కృష్ణయ్య గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు ప్రసాదించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించే అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు అండగా ఉండాలని, సమాజ సేవలో మరింత కాలం కొనసాగించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.



ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు తదితరులు పాల్గొని ఆర్. కృష్ణయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిసి రాజ్యాధికార సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి ,తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్ ,బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు బక్కతట్ల వెంకన్న యాదవ్ ,బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కార్యంగ నరేష్ గౌడ్, విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొంపల్లి రామన్న గౌడ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గం సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గడగోజు విజయ్ చారి, బీసీ రాజాధికార సమితి కార్యదర్శి గుంటు శ్రీనివాసు, బత్తుల నరసింహ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…