Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నల్లగొండలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ

Author
Posted By CHEEKATI VELUGU
| 12 Apr 2026, 06:14 AM | Nalgonda
నల్లగొండలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ


ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.



శనివారం నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల్లో డ్రగ్స్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రెంథెనింగ్ డే సందర్భంగా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.



ఈ ర్యాలీని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.



ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం సమాజానికి పెద్ద ముప్పుగా మారుతోందని, ముఖ్యంగా యువతను దారి తప్పించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి


జిల్లా వ్యాప్తంగా 300 మందికి పైగా విద్యార్థులు, డ్రగ్ లైసెన్స్ హోల్డర్లు పాల్గొని మత్తు మందుల వినియోగం, నకిలీ మందుల నియంత్రణ, ఆంటీబయాటిక్ నిరోధకత వంటి అంశాలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.



మందుల కొనుగోలు సమయంలో QR కోడ్ వెరిఫికేషన్ వంటి సాంకేతిక పద్ధతులను వినియోగించాలని సూచించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.



నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సహకారం అవసరమని తెలిపారు.



ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఏఎస్పీ రమేష్, డిఎంహెచ్ ఓ పుట్ల శ్రీనివాస్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహరావు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.