నల్లగొండలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల్లో డ్రగ్స్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రెంథెనింగ్ డే సందర్భంగా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం సమాజానికి పెద్ద ముప్పుగా మారుతోందని, ముఖ్యంగా యువతను దారి తప్పించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 300 మందికి పైగా విద్యార్థులు, డ్రగ్ లైసెన్స్ హోల్డర్లు పాల్గొని...