నల్గొండలో ఘనంగా ఉమ్మడి జిల్లా స్థాయి కార్యశాల
చీకటి వెలుగు నల్లగొండ.
నల్గొండ బోయవాడలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రభుత్వ యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూడు జిల్లాల నుంచి వంద మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులంతా ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోగలమని అన్నారు. సంఘటిత పోరాటంతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయవచ్చని పేర్కొన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి సైదులు రెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించి, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. తద్వారా పర్యవేక్షక స్థాయి పోస్టులను భర్తీ చేసి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు. గౌరవాధ్యక్షుడు కాసం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ యాజమాన్య సంఘం నిర్మాణం, ఆవశ్యకతతో పాటు సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. సంఘం లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. నల్గొండ జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూడు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనడం సంఘం పునర్వైభవానికి సంకేతమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. స్వామి, సంయుక్త కార్యదర్శి హరి శంకర్, జీజీహెచ్‌ఎంఏ ఉపాధ్యక్షుడు ధర్మా నాయక్, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సైదయ్య, సహాయ అధ్యక్షుడు బద్రీనాథ్, సంయుక్త కార్యదర్శి సైదిరెడ్డి, యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి లింగయ్య, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి మురళి, నల్గొండ పట్టణ కమిటీ అధ్యక్షుడు ముని, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, మహిళా కార్యదర్శి నీరజ, జిటిఏ నల్గొండ గౌరవ అధ్యక్షుడు బుచ్చిరాములు, ప్రవీణ్, జంగయ్య, లింగయ్య, బొజ్జా లాజర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments