చీకటి వెలుగు – నల్లగొండ
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ 15వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ సిద్ధాంతాలు, వ్యూహాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కేసీఆర్ పాలనను ఆచార్య జయశంకర్ చూసి ఉంటే ఎంతో ఆనందించేవారని పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆచార్య జయశంకర్ ఆశయాలను విస్మరించి రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. ఆచార్య జయశంకర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, జేఏసీ నాయకుడు జి. వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఆర్వో మాలే శరణ్యా రెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, సింగం రామ్మోహన్, నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, అయితగోని యాదయ్య, దేప వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, పేర్ల మల్లీశ్వరి అశోక్, కుందూరు దీపిక ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీప్లా, గోపగోని స్వాతి రాజశేఖర్, రావుల శ్రీనివాస రెడ్డి, యుగంధర్ రెడ్డి, జమాల్ ఖాద్రి, దండంపల్లి సత్తయ్య, కన్నారావు, సింగం లక్ష్మి, పల్లె రంజిత్, బడుపుల శంకర్, గుండెబోయిన జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments