తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా నల్లగొండలో ప్రారంభమైన ‘మన చద్దన్నం’ న్యాచురల్ ఫుడ్ స్టాల్, ఆరోగ్యాన్ని మరియు ఉపాధిని అందిస్తూ విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా 05-05-2026న నల్లగొండ పట్టణంలోని ఎన్‌జీ కాలేజీ ముందు ఉన్న మెయిన్ స్టాల్ వద్ద ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ అదనపు ఎస్పీ జి. రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో
- వ్యవస్థాపకులు, యోగా మాస్టర్ & ప్రకృతి విశ్లేషకులు K.Y గిరి గారు
- కార్పొరేటర్ మల్లికార్జున్ గారు
- జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత జర్నలిస్ట్ కంది భజరంగ్ గారు
- పుల్లెంల శంకర్ గారు
- ‘మన చద్దన్నం’ టీం సభ్యులు
తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన అతిథులు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తూ, అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ‘మన చద్దన్నం’ సంస్థ సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరింత విస్తరించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments