ePaper
Saturday, September 5, 2026

పేదల సంక్షేమమే ప్రజా పాలన లక్ష్యంనల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత

చీకటి వెలుగు నల్లగొండ.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా పాలనలో నిరుపేదలకు లబ్ధి చేకూరుతోందని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం నల్గొండలోని శివాజీనగర్‌ నుంచి క్లాక్‌టవర్‌ వరకు సుమారు వెయ్యి మంది కాంగ్రెస్‌ కార్యకర్తలతో ‘వికాస యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా కైలాష్ నేత మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రూ.2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు వంటి పథకాలతో పేదలకు అండగా నిలుస్తోందని తెలిపారు. సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2029లోనూ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రం అప్పులపాలైందని, ఆ పార్టీకి ప్రజా సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. అనంతరం క్లాక్‌టవర్‌ వద్ద కేక్‌ కట్‌ చేసి బాణాసంచా కాల్చి విజయోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!