ePaper
Saturday, September 5, 2026

శ్రావణ తొలి ఆదివారం యల్లమ్మ అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి

చీకటి వెలుగు నల్లగొండ.

కనగల్ మండలం ధర్వేశిపురంలోని శ్రీ యల్లమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం తొలి ఆదివారం భక్తుల సందడి నెలకొంది.
అమ్మవారి దివ్య దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
‘అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే’ అంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
అమ్మవారి సన్నిధిలో అష్టోత్తర శతనామ కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.శ్రావణమాసం సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో ప్రాంగణం సందడిగా మారింది.పూజల్లో పాల్గొన్న భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ముఖ్య అర్చకులు చిలకమర్రి శ్రావణ్ కుమార్ చార్యులు,అర్చకులు దామోదర్, మహేష్,అవ్యయ్ కుమార్, ఆలయ అధికారులు కూసం ఉపేందర్ రెడ్డి, జినుకుంట్ల నాగరాజు,సిహెచ్ శ్రీకర్, తదితరులు ఉన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!