ePaper
Monday, July 27, 2026

చేనేత కార్మికుల అభ్యున్నతికి సహకార సంఘాలు మరింత బలోపేతం కావాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • చర్లపల్లి చేనేత సహకార సంఘం లిమిటెడ్ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

చీకటి వెలుగునల్లగొండ:

నల్లగొండలోని చర్లపల్లి చేనేత సహకార సంఘం లిమిటెడ్ నూతన పాలకవర్గ సభ్యులు అధ్యక్షులు ముషం రవి, ఉపాధ్యక్షులు గంజి రమేష్ , ఎవరో సలహాదారులు రాపోలు శ్రీనివాసులు, కార్యదర్శి గంజి రమేష్ , డైరెక్టర్లు రాపోలు శేషమ్మ, గంజి వెంకమ్మ, చిట్టి ప్రోలు రమేష్ వెంకటేశం, బిక్షం ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చేనేత రంగ అభివృద్ధిలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్న మంత్రి, చేనేత ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం కల్పించడం, కార్మికులకు ఉపాధి అవకాశాలను విస్తరించడం, యువతను చేనేత రంగం వైపు ఆకర్షించే కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నూతన పాలకవర్గం చేనేత కార్మికుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకొని పనిచేయాలని ఆకాంక్షించారు.

నూతన పాలకవర్గం సమష్టి కృషితో చర్లపల్లి చేనేత సహకార సంఘం మరింత అభివృద్ధి సాధించి చేనేత కార్మికులకు ఆదర్శంగా నిలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ స్థానిక ప్రజాప్రతినిధులు, చేనేత కార్మికులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!