ePaper
Wednesday, July 22, 2026

వ్యాపార అభివృద్ధి యే నగరాభివృద్ధి.

మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి.

చీకటి వెలుగు నల్గొండ

వర్తక వాణిజ్య వ్యాపార రంగాలు అభివృద్ధి చెందినప్పుడే నల్లగొండ నగరం అభివృద్ధి చెందుతుందని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు ఆమె నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా అన్ని రకాల ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్ తో ఏర్పాటుచేసిన షో రూమ్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన గృహ నిర్మాణాల కోసం అపార్ట్మెంట్ల కోసం అవసరమైన ఎలక్ట్రికల్ ఐటమ్ కోసం హైదరాబాద్ వెళ్లకుండా నల్లగొండలోనే ఆధునిక పరికరాలు లభించడం వలన నిర్మాణ దారులకు, వ్యయ ప్రయాసలు తప్పుతాయన్నారు, అలాగే పట్టణ అభివృద్ధి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అన్ని రంగాలను అభివృద్ధి పరచడమే కాకుండా పట్టణ ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా షోరూం యజమాని మనిమద్దే శ్రీనివాస్ ను అభినందించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస యాదవ్ మాజీ ఎంపీపీ మనిమద్దే సుమన్, కార్పొరేటర్ వజ్జే సంతోషిని రమేష్, బంధుమిత్రులు పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!