చీకటి వెలుగు. నల్లగొండ..
గృహ కొనుగోలుదారులకు అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కృష్ణ నగర్‌లో ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తున్నట్లు వెంచర్ నిర్వహకుడు బాలాజీ నాయక్ తెలిపారు. ఉగాది, శ్రీరామనవమి పర్వదినాల సందర్భంగా డీటీసీపీ ఆమోదిత లేఅవుట్‌లో 150 గజాల స్థలంతో పాటు 1,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 2 బెడ్‌రూమ్‌ల ఆర్‌సీసీ గృహాన్ని రూ.36.50 లక్షలకు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఈ లేఅవుట్‌ను వాస్తు సూత్రాలకు అనుగుణంగా రూపొందించడంతో పాటు ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఆకర్షణీయమైన తోరణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతర్గత రహదారులను సీసీ రోడ్లతో అభివృద్ధి చేయడంతో పాటు విద్యుత్ సౌకర్యం, వీధి దీపాలు, అవెన్యూ మొక్కల పెంపకం వంటి మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.
అదనంగా ఆధునిక భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, ఓవర్‌హెడ్ ట్యాంక్ ద్వారా నిరంతర నీటి సరఫరా, 24 గంటల సీసీటీవీ భద్రతా నిఘా, పిల్లల కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రశాంత వాతావరణంలో అన్ని సౌకర్యాలతో కూడిన గృహాలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.
వెంచర్‌లో ఓపెన్ ప్లాట్లు కూడా విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని, పరిమిత కాలం పాటు ఈ ప్రత్యేక ఆఫర్ వర్తిస్తుందని బాలాజీ నాయక్ తెలిపారు. ఆసక్తి గల వారు వెంటనే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి, జాల గణేష్, శంకర్, కాసాల జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments