చీకటి వెలుగు హైదరాబాద్:
హైదరాబాద్లోని Falaknuma Kali Mata Temple శ్రీ కాళీమాత ఆలయం సోమవతి అమావాస్య, శుక్రవారాలు మరియు ఆదివారాల్లో భక్తులతో కిటకిటలాడుతోంది.
తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా సోమవతి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించడంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దర్శన క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద పంపిణీ వంటి సౌకర్యాలు కల్పించారు. ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందుతున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments