ePaper
Saturday, September 5, 2026

డీఆర్‌డీవో ఘన విజయం.. వరుసగా మూడు ఫ్లైట్ టెస్టులు సక్సెస్

భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే కీలక సాంకేతికతలను విజయవంతంగా ప్రదర్శించింది.

దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, మధ్య శ్రేణిలో శత్రు నౌకల ముప్పును ఎదుర్కొనే బహుళస్థాయి రక్షణ వ్యవస్థకు సంబంధించిన మూడు వరుస ఫ్లైట్ టెస్టులను విజయవంతంగా నిర్వహించింది.

ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, బృందాన్ని అభినందించారు.

ఈ పరీక్షలతో భారత్, అంతర్మహాద్వీప బాలిస్టిక్ క్షిపణులు (ICBM) సహా శత్రు బాలిస్టిక్ క్షిపణులను గుర్తించి అడ్డుకునే సామర్థ్యం కలిగిన ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఈ విజయం కీలక మైలురాయిగా భావిస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!