ePaper
Monday, June 8, 2026

నల్లగొండలో విషాదం.. తండ్రి, కుమారుడు మృతిచెందిన ఘటన కలకలం

చీకటి వెలుగు, నల్లగొండ:

నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకదుర్గ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్నట్లు తెలిసిన పబ్బతి రెడ్డి లింగారెడ్డి (48) తన నివాసంలో పురుగుల మందు తాగి మృతి చెందిన స్థితిలో కనిపించగా, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి (13) రక్తపు గాయాలతో మృతిచెంది ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఘటన జరిగిన సమయంలో లింగారెడ్డి భార్య పెద్ద కుమారుడిని హైదరాబాద్‌లోని హాస్టల్‌లో చేర్పించేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

స్థానికుల కథనం మేరకు, లింగారెడ్డి గతంలో రోడ్డు ప్రమాదానికి గురై కొంతకాలంగా మెదడు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే నల్లగొండ వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన హత్యా, ఆత్మహత్యా లేదా మరేదైనా కారణంతో జరిగిందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల దర్యాప్తు అనంతరం వెలుగులోకి రానున్నాయి.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!