నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన పొట్టేపాక సైదులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేముల వీరేశం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారమవుతోందని అన్నారు. పేదల సంక్షేమం, అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments