ePaper
Thursday, June 4, 2026

ఉద్యోగుల హక్కుల సాధనలో భిక్షమయ్య సేవలు చిరస్మరణీయం పదవీ విరమణ సభ ఘనంగా నిర్వహణ

చీకటి వెలుగునల్గొండ, తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ ఏనుగుల భిక్షమయ్య గారి పదవీ విరమణ సభ బుధవారం టీఎన్జీఓఎస్ జిల్లా భవనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీ నాగిళ్ల మురళి గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యోగ సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దాస్య నాయక్ గారు మాట్లాడుతూ, భిక్షమయ్య గారు ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ఉద్యోగ సంఘ బలోపేతానికి ఆయన అందించిన సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

జిల్లా టిబి కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సంజీవయ్య, డాక్టర్ రవి ప్రసాద్, డీటీడీవో, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారులు తదితరులు మాట్లాడుతూ, గత 35 సంవత్సరాలుగా ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తూ ఉద్యోగులకు అండగా నిలిచిన భిక్షమయ్య గారి సేవలను ప్రశంసించారు.

ఈ సందర్భంగా భిక్షమయ్య గారిని ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. అనంతరం భిక్షమయ్య గారు మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో సహకరించిన అధికారులు, ఉద్యోగులు, సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ నాయకులు మనోజ్ ప్రదీప్, లక్ష్మయ్య, ప్రణాదేవి, సత్యనారాయణ, అంజనేయులు, రమ్యసుధ, సుమలత, డీఐ రాజు, జయరావు, భాస్కర్ పాల్గొన్నారు. అలాగే ఐన్టీసీ బిక్షం, తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘ నాయకులు మణికుమార్, రాజమల్లయ్య, రాజయ్య, వెంకన్న, సుశీల, రేణుక తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!