ఫిట్ & యాక్టివ్ తెలంగాణలో భాగంగా యోగా కార్యక్రమం
శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్గొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీలో జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫిట్‌నెస్ ప్రాధాన్యతపై కలెక్టర్ అవగాహన కల్పించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 18 నుంచి 23 వరకు యువజన వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే “ఫిట్ & యాక్టివ్ తెలంగాణ” కార్యక్రమం కింద యోగా నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని, వారం రోజుల పాటు ఫిట్ తెలంగాణ–ఫిజికల్ లిటరసీ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.
ప్రతిరోజు పనుల వల్ల శరీరం అలసటకు గురవుతుందని, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు వ్యాయామం, యోగా తప్పనిసరిగా చేయాలని సూచించారు. యోగా జీవితంలో భాగమైతే శారీరకంగా, మానసికంగా దృఢత్వం పెరిగి రోగాలు దరిచేరవని పేర్కొన్నారు. ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చన్నారు.
ఈ వారం రోజులపాటు ఫిట్‌నెస్‌తో పాటు పర్యాటకానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా క్రీడలు & యువజన సర్వీసుల శాఖ అధికారి అక్బర్ అలీ, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన 2కే మారథాన్‌ను కలెక్టర్ ప్రారంభించి స్వయంగా రన్‌లో పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments