చీకటి వెలుగు నల్గొండ:
సిరిపోలు వెంకటపతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయానికి పుస్తకాలు విరాళంగా అందజేయడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ డా. హఫీజ్ ఖాన్ తెలిపారు. పుస్తకాలను అందజేసిన ట్రస్ట్ చైర్మన్ సిరిపోలు వెంకటపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సిరిపోలు వెంకటపతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ సిరిపోలు వెంకటపతి జిల్లా గ్రంథాలయానికి పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఈ పుస్తకాలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ డా. హఫీజ్ ఖాన్ స్వీకరించారు.
ఈ సందర్భంగా డా. హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ, సిరిపోలు వెంకటపతి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు అందరికీ తెలిసిందేనని అన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా గ్రంథాలయానికి పుస్తకాల విరాళం అందించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులకు ఈ పుస్తకాలు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిరిపోలు వెంకటపతి ట్రస్ట్ చైర్మన్ సిరిపోలు వెంకటపతి, నర్సింహా రెడ్డి, యూనుస్, మల్లారెడ్డి, లియాకత్, ఇనాయత్, శ్రీలక్ష్మి, యాదగిరి, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments