నల్లగొండలోని ఎస్‌బిఆర్ ఫంక్షన్ హాల్‌లో క్రిస్టియన్ ఫెలోషిప్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల హోదాను రద్దు చేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సమావేశంలో పాల్గొన్నవారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ B. R. Ambedkar రూపొందించిన రాజ్యాంగంలో దళిత క్రిస్టియన్ల హక్కులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రిజర్వేషన్ల అమలుకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వానికి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు.
డాక్టర్ క్రిస్టోఫర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెవరెండ్ గాలి వినోద్, కడిమి కృష్ణ, రాజీవ్ సాగర్, సాల్మన్ రాజు, రెవరెండ్ జగ్జీవన్, పసల శౌరయ్య, ప్రశాంత్, ఎలీషా, ఆచయ్య, ప్రభు చరణ్, ప్రవీణ్ కుమార్, ప్రదీప్, సామ్యూల్, ప్రకాష్, లక్ష్మయ్య, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments