నల్లగొండ, ఏప్రిల్ 24: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 15వ ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవా సమితి, నల్లగొండ ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
రోజురోజుకు పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని నల్లగొండ పట్టణంలోని VT కాలనీ, బస్ స్టాండ్, భాస్కర్ థియేటర్ ప్రాంతాల్లో రోడ్డు పక్కన పని చేసే చెప్పుల కూలీలకు ఎండ నుండి రక్షణ కోసం పెద్ద గొడుగులను పంపిణీ చేశారు.
అలాగే మిర్యాలగూడ బైపాస్ రోడ్డులోని లెప్రసీ కాలనీలో సుమారు 100 మందికి మహా నారాయణ సేవ నిర్వహించి అన్నదానం చేశారు.
ఇక హైదరాబాద్ రోడ్డులో సమితి నిర్వహిస్తున్న చలివేంద్రములో ఈరోజు మంచినీటితో పాటు మజ్జిగను కూడా పంపిణీ చేశారు.
ఈ సేవా కార్యక్రమాలలో సమితి కన్వీనర్ విశ్వేశ్వర్తో పాటు మహిళా, పురుష సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments