ePaper
Saturday, September 5, 2026

మే 3న నల్గొండ ప్రోమో రన్… ప్రజలకు ఎస్పీ పిలుపు

సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో మే 3న నల్గొండలో ప్రోమో రన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

“రన్ ఫర్ తెలంగాణ – ఫిట్ ఫర్ తెలంగాణ”, “రన్ ఫర్ నల్గొండ – ఫిట్ ఫర్ నల్గొండ” అనే ద్యేయంతో 2K, 5K, 10K రన్స్ నిర్వహించబడనున్నాయి.

ఈ కార్యక్రమం ద్వారా నగరంలో రన్నింగ్ కల్చర్ అభివృద్ధి చెందడంతో పాటు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడతారని ఎస్పీ తెలిపారు. తాను కూడా ఈ రన్‌లో పాల్గొననున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో రన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి పోస్టర్‌ను స్వీకరించి ఈ కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు.

ఆసక్తి గల వారు ఈ నెల 26వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!