ePaper
Wednesday, April 8, 2026

విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రారంభం

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల కమిటీ పిలుపు మేరకు నిరవధిక సమ్మె ప్రారంభమైంది. సమ్మెలో భాగంగా మొదటి రోజున నల్గొండ సర్కిల్ ట్రాన్స్కోలో 100 శాతం మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా TVAE JAC కన్వీనర్ మద్ది శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.

ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలని, కానీ స్టాండింగ్ రూల్స్ పేరుతో వేర్వేరు నిబంధనలు అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

స్టాండింగ్ రూల్స్‌ను రద్దు చేసి APSEB రూల్స్ అమలు చేయాలని ప్రధాన డిమాండ్‌గా పేర్కొన్నారు. అలాగే GO నెం.11 అమలు చేసి, ఆర్టిజన్‌గా గుర్తింపు లేని కార్మికులను కూడా ఆర్టిజన్‌గా గుర్తించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో JAC కో-చైర్మన్ డి. రమేష్, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, భూషణ్, రాజు యాదగిరి, శ్రీనివాస్, రాము, నరసింహ, రవి, సైదులు, వెంకట్ రామకృష్ణ, సత్యవతి, కృష్ణవేణి, చైతన్య, ముకీద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!