ePaper
Saturday, March 7, 2026

ఎర్రవెల్లిలో కేసీఆర్‌ను కలిసిన ఆశన్నగారి జీవన్ రెడ్డి

తన జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి శనివారం ఎర్రవెల్లిలో బి.ఆర్.ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని ఆత్మీయంగా పలకరించిన కేసీఆర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ భేటీ సందర్భంగా పార్టీ కార్యకలాపాలు మరియు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పార్టీ అధినేతను కలుసుకుని ఆశీర్వాదం పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందని జీవన్ రెడ్డి తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!