ePaper
Monday, March 2, 2026

డిసిసి అధ్యక్షులతో రాహుల్ సమావేశం… బీసీలకు ప్రాధాన్యం హామీ

నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత సోమవారం వికారాబాద్‌లో జరిగిన శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల కోసం నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పున్నా కైలాష్ నేత తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్‌ను కలుసుకున్నారు.

సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, డిసిసి అధ్యక్షులు బలంగా పనిచేసి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రజల మధ్య పనిచేస్తేనే పదవులు వస్తాయని, కేవలం నాయకుల చుట్టూ తిరిగితే ఫలితం ఉండదని స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో బీసీ వర్గాలకు తగు ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పున్నా కైలాష్ నేత కుమారుడు జయంత్ విక్రమ్ రాహుల్ గాంధీ చిత్రంతో కూడిన జ్ఞాపికను అందజేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!