ePaper
Friday, April 17, 2026

నందికొండ మునిసిపల్‌లో కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించిన మాజీ మంత్రి జానారెడ్డి

నందికొండ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజాస్వామ్య పండుగ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జానారెడ్డి కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అలాగే ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించి ప్రజలకు ఓటు ప్రాధాన్యతపై సందేశం ఇచ్చారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ హక్కును తప్పక వినియోగించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించగా, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ చేస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!