ePaper
Monday, March 2, 2026

రన్నింగ్ రైలు నుంచి జారిపడ్డ వ్యక్తి.. ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

నల్గొండ:

నల్గొండ రైల్వే స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు రన్నింగ్ రైలు నుంచి ఓ వ్యక్తి కింద పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదాన్ని గమనించిన రైల్వే స్టేషన్ సిబ్బంది వెంటనే 108 అంబులెన్స్ సేవలకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే నల్గొండ టౌన్ 108 అంబులెన్స్ సిబ్బంది వెంకటేష్, కోటేష్ ఘటన స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాల సమీపంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గుర్తించిన 108 సిబ్బంది, సుమారు అర కిలోమీటర్ దూరం వరకు స్ట్రెచర్‌పై మోసుకెళ్లి అంబులెన్స్‌ వరకు తీసుకువచ్చారు.

అనంతరం అంబులెన్స్‌లోనే ప్రథమ చికిత్స అందించి, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

108 సిబ్బంది చూపిన మానవత్వం, తక్షణ స్పందనకు స్థానికులు అభినందనలు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!