ePaper
Monday, March 16, 2026

తుంగతుర్తిలో రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయురాలు స్పాట్‌లో మృతి

సూర్యాపేట జిల్లా / తుంగతుర్తి నియోజకవర్గం:

తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని అర్వపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందగా, మరో ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు వెళ్తున్న ఉపాధ్యాయులు ఈ ప్రమాదానికి గురయ్యారు.

స్థానికుల కథనం ప్రకారం, కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టింది. కారులో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు ఉపాధ్యాయురాలు కల్పన ఘటన స్థలంలోనే మృతి చెందారు.

ప్రమాదంలో రావులపల్లి హెడ్మాస్టర్తో పాటు మరో హెడ్మాస్టర్ తులసికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!