ePaper
Monday, March 16, 2026

స్వామి వివేకానందుని మాటలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద బోధనల ప్రకారం యువత ఆత్మవిశ్వాసంతో ఒకే లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశభక్తిని పెంపొందించుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

డీవైఎఫ్ఐ యువతను చైతన్యపరుస్తూ గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన సదస్సులు, సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత త్యాగం, సేవా భావం అలవర్చుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. స్వామి వివేకానందుని మాటలు ఆచరించి సన్మార్గంలో ప్రయాణించాలన్నారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్‌తో పాటు నాయకులు కత్తుల లింగస్వామి, నాతి నరేష్, వేణు, రాము, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!