చీకటి వెలుగు నల్లగొండ
,
పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరణ్య కేఫ్ బుధవారం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కేఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ మొహమ్మద్ అశ్రఫ్ అలీ ముఖ్య అతిథిగా హాజరై కేఫ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ నల్లగొండ ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో అరణ్య కేఫ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రస్తుత జీవనశైలికి అనుగుణంగా టీ, కాఫీతో పాటు టిఫిన్స్, అల్పాహారం, భోజనం, వివిధ రకాల చిరుతిళ్లను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ కేఫ్ మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. కేఫ్ ప్రొపరైటర్ సింగం కార్తీక్ మాట్లాడుతూ “నల్లగొండ ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే మా ప్రధాన లక్ష్యం. రుచి, నాణ్యత, పరిశుభ్రతకు సమాన ప్రాధాన్యం ఇస్తాం. టీ, కాఫీ నుంచి టిఫిన్స్, భోజనం, చిరుతిళ్ల వరకు వినియోగదారులకు అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రజల ఆదరణతో అరణ్య కేఫ్‌ను మరింత అభివృద్ధి చేస్తాం” అని తెలిపారు. అనంతరం 25వ డివిజన్ కార్పొరేటర్ వంగూరి నవ్యశ్రీ రాఖీ, 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు యాదవ్ తదితరులు కేఫ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అరణ్య కేఫ్ ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వెంకటాపురం సర్పంచ్ సింగం రామలింగయ్య, ప్రొపరైటర్ సింగం కార్తీక్, బొల్లం సురేష్, బత్తుల నేతాజీ, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు ఏర్పుల వెంకన్నతో పాటు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments