తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు భారీ శుభవార్త అందింది. కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద టీజీఎస్ఆర్టీసీకి మరో 200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది.
ప్రస్తుతం నగరంలో పెరుగుతున్న రద్దీ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నడపనున్నారు.
ఈ బస్సుల సరఫరా కోసం టెండర్ల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. తయారీ సంస్థలను ఎంపిక చేసి త్వరలోనే బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
అధికారుల సమాచారం ప్రకారం, ఈ బస్సులను ఆర్టీసీ అద్దె పద్ధతిలో (lease model) తీసుకునే విధానాన్ని అనుసరించనుంది. దీంతో నిర్వహణ ఖర్చులు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి మేలు కలగనుంది.
ఈ నిర్ణయంతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన, కాలుష్య రహిత ప్రయాణం అందుబాటులోకి రానుంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments