హైదరాబాద్: తెలంగాణ సాహిత్య రంగానికి తీరని లోటు. ప్రముఖ కవి, గేయ రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ సృష్టికర్త అందెశ్రీ (64) ఈ రోజు (నవంబర్ 10, 2025) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
నిన్న రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో, కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు.
సాహితీ ప్రస్థానం:
ఉమ్మడి నల్లగొండ జిల్లా (ప్రస్తుత జనగామ జిల్లా) మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1960లో జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లన్న. తన జీవితంలో ఎదురైన కష్టాలను, సామాజిక అంశాలను కవిత్వంగా మలచిన ఆయన, తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కీలక పాత్ర పోషించారు. ఆయన రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గీతంగా గుర్తించింది.
పురస్కారాలు:
• 2006లో ‘గంగ’ చిత్రంలోని పాటలకు గాను నంది పురస్కారం అందుకున్నారు.
• 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ నుండి డాక్టరేట్ పొందారు.
అందెశ్రీ మృతి పట్ల ముఖ్యమంత్రి సహా పలువురు రాజకీయ, సినీ, సాహితీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన ఆకస్మిక మరణం తెలంగాణ ప్రజలను, సాహితీ లోకాన్ని శోకసంద్రంలో ముంచింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments