తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైన దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పు ప్రకటించారు. ఈ కేసులో ఇద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్, వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారని స్పష్టం చేశారు.
ఇదే తరహాలో ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లను కూడా స్పీకర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా దానం నాగేందర్, కడియం శ్రీహరిపై కూడా తీసుకున్న నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం, అలాగే కడియం శ్రీహరి తన కూతురు కడియం క్యావ్యకు మద్దతుగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడం నేపథ్యంలో వీరిపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లపై విచారణ అనంతరం స్పీకర్ తుది తీర్పు వెల్లడిస్తూ ఇద్దరికీ ఉపశమనం కలిగించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments