Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అరకొర వసతులతో తూ తూ మంత్రంగా. కార్పొరేషన్ అయి మొదటి .బతుకమ్మ వేడుకల్లో అరకొర ఏర్పాట్లు..

Author
Posted By CHEEKATI VELUGU
| 16 Oct 2026, 12:27 PM | Bhakti
అరకొర వసతులతో తూ తూ మంత్రంగా. కార్పొరేషన్ అయి మొదటి .బతుకమ్మ వేడుకల్లో అరకొర ఏర్పాట్లు..

చీకటి వెలుగు నల్లగొండ.

విద్యుత్ లైట్లు,తాగునీరు లేదు.. సౌండ్ బాక్సులు లేవు..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ నిర్వహణలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వేడుకల ఏర్పాట్ల బాధ్యతల్లో కీలక పాత్ర పోషించాల్సిన మున్సిపల్ అధికారులు పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నాగార్జున ప్రభుత్వ కళాశాల మైదానంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు అక్కడికి వచ్చే మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం జరిగిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాగునీటి సౌకర్యం లేకపోవడం, బతుకమ్మ పాటల కోసం సౌండ్, బాక్సులు, విద్యుత్ లైట్లు కూడా అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి

నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి బతుకమ్మ పండుగ ఈ నేపథ్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. అయినప్పటికీ, కనీస ఏర్పాట్ల విషయంలోనే లోపాలు కనిపిస్తుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ప్రభుత్వం పండుగలను ఘనంగా నిర్వహించాలని భావిస్తే, క్షేత్రస్థాయిలో అధికారులు కూడా అదే స్థాయిలో బాధ్యతతో వ్యవహరించాలి. కాగితాలపై షెడ్యూల్ సిద్ధం చేయడం మాత్రమే సరిపోదు.. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించినప్పుడే వేడుకలకు సార్థకత చేకూరుతుంది. మొదటి రోజు డిపార్ట్మెంట్ వారిగా మహిళలతోపాటు జిల్లా అధికారులు, సిబ్బంది బతుకమ్మ మాటల్లో పాల్గొనగా మున్సిపల్ కమిషనర్ కనీసం పాల్గొనకుండా ప్రేక్షకుడిగానే నిలబడిపోయాడు,

ఇప్పటికైనా కమిషనర్ స్పందిస్తారా వసతులు కల్పిస్తారా చూద్దాం.