Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

Author
Posted By CHEEKATI VELUGU
| 11 Oct 2026, 05:18 PM | Bhakti, వరంగల్
భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, అక్టోబర్ 11:
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కుటుంబ సమేతంగా ఆదివారం వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు కుటుంబ సమేతంగా విచ్చేసిన జిల్లా కలెక్టర్‌కు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు చేపట్టి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అమ్మవారి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా ఆలయ పరిపాలన విభాగం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
భద్రకాళి ఆలయంలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడుతున్నాయని వారు పేర్కొన్నారు