Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సమాచార ప్రసార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ లను ఘనంగా సన్మానించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు.

Author
Posted By CHEEKATI VELUGU
| 09 Oct 2026, 05:10 PM | వరంగల్
సమాచార ప్రసార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ లను ఘనంగా సన్మానించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు.

వరంగల్ ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ గా భాధ్యతలు చేపట్టి మొదటి సారిగా వరంగల్ విచ్చేసిన డీఎస్ జగన్ ను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్ లు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ కన్నేకంటి వెంకటరమణ, పూర్వ డీపీఆర్వో మనోహరాచారి, వరంగల్ జిల్లా డీపీఆర్వో ప్రేమలత, ఖమ్మం డీపీఆర్వో గౌస్ పాషా, రిటైర్డ్ ఉద్యోగి విధుమౌళి లను ప్రెస్ క్లబ్ వచ్చిన సందర్భంగా శాలువా కప్పి మెమెంటో అందజేసి ఘనంగా సన్మానించారు.
వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోచేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు యంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ సుధాకర్, ఈసీ మెంబర్లు నయీంపాషా, అంజి తదితరులు పాల్గొన్నారు