Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మొరిశెట్టి నాగేశ్వరరావుకు ఘన నివాళులు

Author
Posted By CHEEKATI VELUGU
| 08 Oct 2026, 05:14 PM | నల్గొండ
మొరిశెట్టి నాగేశ్వరరావుకు ఘన నివాళులు

నల్లగొండ: పట్టణ మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు మృతి తీవ్రంగా కలచివేసిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నాగేశ్వరరావు పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు, తన వార్డుకు నాగేశ్వరరావు అందించిన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. ఆయన మృతి నల్లగొండ పట్టణానికి తీరని లోటని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నాగేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో పాటు పలువురు పాల్గొని నాగేశ్వరరావుకు నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి