Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పారిశుధ్య నిర్వహణలో చొరవ చూపిన కంది హనుమాన్ ప్రసాద్‌కు ఘన సన్మానం

Author
Posted By CHEEKATI VELUGU
| 30 Sep 2026, 05:55 PM | Array
పారిశుధ్య నిర్వహణలో చొరవ చూపిన కంది హనుమాన్ ప్రసాద్‌కు ఘన సన్మానం

చౌటుప్పల్: మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణలో ప్రత్యేక చొరవ చూపడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన పారిశ్రామిక కార్మికులను గుర్తించి పెనాల్టీలు విధించిన సానిటరీ ఇన్‌స్పెక్టర్ కంది హనుమాన్ ప్రసాద్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి మోగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ ఘనంగా సన్మానించారు.

వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించడంలో పారిశుధ్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ హనుమాన్ ప్రసాద్ కీలకంగా వ్యవహరించారని చైర్‌పర్సన్, కమిషనర్ అభినందించారు. పట్టణంలో పారిశుధ్య ప్రమాణాలు మెరుగుపడేలా నిరంతరం పర్యవేక్షిస్తూ, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.

పట్టణ పరిశుభ్రత, పారిశుధ్య పరిరక్షణ కోసం అధికారులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని వారు సూచించారు. ఈ సందర్భంగా కంది హనుమాన్ ప్రసాద్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.