Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి నల్లగొండలో యువజన కాంగ్రెస్ నిరసన.. జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

Author
Posted By CHEEKATI VELUGU
| 27 Sep 2026, 05:54 PM | నల్గొండ
ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి  నల్లగొండలో యువజన కాంగ్రెస్ నిరసన.. జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

నల్లగొండ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్‌లో నిరసన చేపట్టారు.

జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియపై జ్ఞానేశ్ కుమార్ వైఖరిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఆరోపించారు. ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

దేశవ్యాప్తంగా కూడా యువజన కాంగ్రెస్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టినట్లు తాజా వార్తా నివేదికలు పేర్కొంటున్నాయి.

కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జి శ్యామ్ చరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర గౌతమి, జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర రామ్ సింగ్, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, కార్పొరేటర్ మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.