Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక

Author
Posted By CHEEKATI VELUGU
| 14 Mar 2026, 09:05 PM | Nalgonda
ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక


ఇఫ్తార్ విందులు సమాజంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అమీర్ అలీ పేర్కొన్నారు.



శనివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ బిటిఎస్ ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ ఎండి ఇబ్రహీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు, ప్రజలు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి


ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రంజాన్ పండుగను ముస్లింలు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఇఫ్తార్ విందులు సమాజంలో సౌహార్దాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.



ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, నదీమ్, ఇర్ఫాన్, మాజీ కౌన్సిలర్ పున్న గణేష్ తదితరులు పాల్గొన్నారు.