Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఫిబ్రవరి 1న ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. ఇన్వెస్టర్లకు అలర్ట్

Author
Posted By CHEEKATI VELUGU
| 17 Jan 2026, 01:26 PM | వ్యాపారం
ఫిబ్రవరి 1న ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. ఇన్వెస్టర్లకు అలర్ట్


బిజినెస్ న్యూస్:



కేంద్ర బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి స్టాక్ మార్కెట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, అదే రోజు స్పెషల్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజ్‌లు ప్రకటించాయి.


ఇవి కూడా చదవండి


సాధారణంగా ఆదివారాలు స్టాక్ మార్కెట్‌కు సెలవు దినం అయినప్పటికీ, బడ్జెట్ ప్రభావాన్ని మార్కెట్ వెంటనే ప్రతిబింబించేందుకు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సెషన్‌లో ఈక్విటీ, డెరివేటివ్స్ వంటి విభాగాల్లో ట్రేడింగ్ జరగనుంది.



బడ్జెట్‌లో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు, పన్నుల మార్పులు, మౌలిక సదుపాయాలపై కేటాయింపులు మార్కెట్‌పై కీలక ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ ప్రత్యేక సెషన్‌పై భారీ ఆసక్తి చూపుతున్నారు.