Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బిగ్ బ్రేకింగ్: ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గేట్ నెం. 4 వద్ద భారీ పేలుళ్లు - 9 మంది మృతి, దేశమంతటా హై అలెర్ట్!

Author
Posted By CHEEKATI VELUGU
| 10 Nov 2025, 09:19 PM | ఢిల్లీ
బిగ్ బ్రేకింగ్: ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గేట్ నెం. 4 వద్ద భారీ పేలుళ్లు - 9 మంది మృతి, దేశమంతటా హై అలెర్ట్!


ఘటన సమయం: సోమవారం సాయంత్రం 6:55 గంటలకు (ప్రాథమిక సమాచారం).



• ఘటనా స్థలం: దేశ రాజధాని ఢిల్లీ, రెడ్ ఫోర్ట్ గేట్ నంబర్ 4 సమీపంలో.



• నష్ట తీవ్రత:



• మృతులు: 9 మంది మరణించినట్లు సమాచారం (8 మంది ఆసుపత్రికి తరలించేలోపే మృతి).



• గాయపడిన వారు: 30 మందికి పైగా గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది.



• ఆస్తి నష్టం: పేలుడు ధాటికి 6 కార్లు, 4 ఆటో రిక్షాలు, 4 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. పేలుడు పరిధి 100 నుంచి 150 మీటర్ల వరకు ఉన్నట్లు అంచనా.



• ఆందోళనకర అంశాలు:



• పేలుడు జరిగిన ప్రాంతానికి 70 మీటర్ల దూరంలోనే గౌరీ శంకర్ ఆలయం ఉంది, సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.



• కార్యాలయాలు ముగిసి, ప్రజలు ఇళ్లకు చేరుకునే రద్దీ సమయంలో ఈ పేలుడు జరిగింది.


ఇవి కూడా చదవండి


• చివరిసారిగా 2011లో ఢిల్లీ హైకోర్టు వద్ద పేలుడు జరిగిన తర్వాత 14 ఏళ్ల తర్వాత ఇంత భారీ పేలుడు సంభవించడం ఆందోళనకరం.



• ప్రభుత్వ స్పందన & దర్యాప్తు:



• కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో సంభాషించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.



• ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమిత్ షాతో మాట్లాడి సంఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు.



• సంఘటనా స్థలానికి ఎన్ఎస్ఏ (NSA), ఎన్ఎస్జీ (NSG), ఢిల్లీ స్పెషల్ సెల్, ఫోరెన్సిక్ నిపుణులు చేరుకుని శాంపిల్స్ సేకరిస్తున్నారు.



• దరియా గంజ్ నుండి ఎర్రకోట వరకు వాహనాల రాకపోకలు నిలిపివేసి, చాందినీ చౌక్‌ను మూసివేశారు.



• ఉగ్రవాద అనుమానాలు: సీఎన్జీ (CNG) పేలుడు కాకపోవచ్చునని, టెర్రరిస్టుల పనే అయి ఉంటుందని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.



• గతంలో ఢిల్లీ శివార్లలో అమ్మోనియం నైట్రేట్ (2560 కిలోలు), ఆర్డీఎక్స్ (350 కేజీలు) వంటి పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు.



• స్లీపర్ సెల్స్ కదలికలు, నాలుగు వేల మంది పాకిస్తానీలతో కూడిన టెలిగ్రామ్ గ్రూప్‌ను గుర్తించిన నేపథ్యంలో ఉగ్రకుట్ర కోణంలో దర్యాప్తు జరుగుతోంది.