Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

లడ్డూ 'కల్తీ' వెనుక భారీ కుట్ర! - YV సుబ్బారెడ్డి పీఏ అరెస్ట్‌తో TTD నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్!

Author
Posted By CHEEKATI VELUGU
| 08 Nov 2025, 12:59 PM | తిరుపతి
లడ్డూ 'కల్తీ' వెనుక భారీ కుట్ర! - YV సుబ్బారెడ్డి పీఏ అరెస్ట్‌తో TTD నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్!


కీలక పరిణామం: తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సిట్ దర్యాప్తులో భారీ కుట్ర కోణం బయటపడింది.



• నిందితుడు: టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పీఏగా పనిచేసిన కడూరు చిన్న అప్పన్నను సిట్ అధికారులు అరెస్టు చేసి 24వ నిందితుడిగా చేర్చారు.



• కుట్ర వివరాలు (రిమాండ్ రిపోర్టు ప్రకారం):



• 2022లో అప్పన్న, అప్పటి టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను సంప్రదించారు.



• నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్ చేసి, ప్రతి కిలో నెయ్యిపై రూ. 25 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి



• డెయిరీ యాజమాన్యం కమీషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆ సంస్థపై అనర్హత వేటు వేయడానికి అప్పన్న కుట్ర పన్నారు.



• అజ్ఞాత వ్యక్తులతో పిటిషన్లు వేయించి, భోలేబాబా డెయిరీని తనిఖీ చేయాలని టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు.



• ఫలితంగా, భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణ నిలిచిపోయింది. వారి స్థానంలో వచ్చిన ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అనే సంస్థ, కిలోకు రూ. 138 ఎక్కువ కోట్ చేసి కాంట్రాక్టు దక్కించుకుంది.



• ముడుపులు: ఈ మొత్తం వ్యవహారంలో చిన్న అప్పన్నకు దాదాపు రూ. 50 లక్షల వరకు ముడుపులు అందినట్లు అప్పన్న బ్యాంకు లావాదేవీల ద్వారా సిట్ గుర్తించింది.