ePaper
Tuesday, March 17, 2026

సంక్రాంతి సందడిలో ఎస్‌సీ బాలికల వసతి గృహంలో ముగ్గుల పోటీలు

బ్రాహ్మణవెల్లంల

సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్‌సీ డీడీ గారి ఆదేశాల మేరకు బ్రాహ్మణవెల్లంల యందు ఎస్‌సీ బాలికల వసతి గృహంలో హాస్టల్ విద్యార్థినీలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థినీలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. రంగురంగుల ముగ్గులతో వసతి గృహ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారిణి కె. రాధా కుమారి మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలలో ఒత్తిడిని తగ్గించి, వారి సృజనాత్మకతను పెంపొందించి, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వసతి గృహ సిబ్బంది మరియు విద్యార్థినీలు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!