హైదరాబాద్ రాజ్ భవన్‌లో ఈరోజు (అక్టోబర్ 31, 2025) భారత క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ వేడుకలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనకు ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు కృతజ్ఞతలు తెలుపుతూ అజారుద్దీన్ మాట్లాడుతూ, “ప్రజలకు సేవ చేయడం, క్రీడల అభివృద్ధి, యువతకు అవకాశాలు కల్పించడం నా ప్రాధాన్య కర్తవ్యం” అని పేర్కొన్నారు.
అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, క్రీడా ప్రముఖులు హాజరై అభినందనలు తెలిపారు. రాజ్ భవన్ ప్రాంగణం ఆత్మీయ వాతావరణంలో కళకళలాడింది.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments