ePaper
Wednesday, September 9, 2026

నీలగిరిలో తెల్లబట్టల వెనుక నల్ల త్రాసు..? పేదలే టార్గెటా!

కార్పొరేట్ ఆసుపత్రులపై శాసనమండలిలో రాములమ్మ ఫైర్..

కార్పొరేట్ ఆసుపత్రుల వ్యవహారంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, నల్లగొండ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై జరుగుతున్న తనిఖీల విషయంలో ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న ఆసుపత్రులపై నామమాత్రపు తనిఖీలు చేస్తూ, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఆసుపత్రులను మాత్రమే కఠినంగా టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

‘ఐదు గంటల్లో చనిపోతారు’ అన్నారంటూ బాధితుడి ఆరోపణ

నల్లగొండ రామగిరిలోని నిమ్స్ రివర్ ఆసుపత్రిపై ఓ బాధితుడు తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. ENOతో నయమయ్యే ఆరోగ్య సమస్యకు సర్జరీ అవసరమని, సుమారు రూ.12 లక్షలు ఖర్చవుతాయని, పరిస్థితి విషమంగా ఉందని, ఐదు గంటల్లో ప్రాణాపాయం సంభవించవచ్చని వైద్యులు చెప్పినట్లు బాధితుడు ఆరోపించాడు.

దీంతో భయాందోళనకు గురైన బాధితుడు తన వారసత్వ భూమిని మార్కెట్ విలువ సుమారు రూ.30 లక్షలు ఉన్నప్పటికీ రూ.12 లక్షలకు విక్రయించాల్సి వచ్చిందని తెలిపాడు.

అనంతరం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా, అక్కడి వైద్యులు గతంలో ఇచ్చిన నివేదికలపై భిన్నమైన వైద్య అభిప్రాయం వ్యక్తం చేశారని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని డిశ్చార్జ్ సమ్మరీలో కూడా నమోదు చేసినట్లు ఆయన చెబుతున్నాడు.

ఆసుపత్రి వర్గాల వివరణ

ఈ ఆరోపణలపై నిమ్స్ రివర్ ఆసుపత్రి ఇన్‌చార్జిని సంప్రదించగా, వార్తలో పేర్కొన్న సమాచారం తప్పు అని ఆసుపత్రి వర్గాలు ఖండించినట్లు సమాచారం. గంటకు రూ.70 వేల చార్జ్ తీసుకోలేదని, 24 గంటలకు రూ.54 వేలు మాత్రమే వసూలు చేసినట్లు వారు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అందువల్ల బాధితుడి ఆరోపణలు, ఆసుపత్రి వివరణలపై అధికారుల విచారణతో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

రేపు DMHOకు ఫిర్యాదు

ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన బాధితుడు.. తనకు జరిగిన అన్యాయంపై నల్లగొండ DMHO కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించాడు.

ఈ ఫిర్యాదుతో వైద్య నివేదికలు, చికిత్స అవసరం, సర్జరీ సిఫార్సు, ఆసుపత్రి బిల్లులు, రిఫరల్ వ్యవహారం తదితర అంశాలపై అధికారుల దర్యాప్తు జరిగే అవకాశం ఉంది.

DMHOపై ప్రజల ప్రశ్నలు

  • ప్రైవేట్ ఆసుపత్రులపై తనిఖీలు పారదర్శకంగా జరుగుతున్నాయా?
  • రాజకీయ పలుకుబడి ఉన్న ఆసుపత్రులకు మినహాయింపులు ఉన్నాయా?
  • అవసరం లేని పరీక్షలు, చికిత్సలు లేదా సర్జరీలు సిఫార్సు చేస్తున్నారనే ఫిర్యాదులపై విచారణ ఎందుకు జరగడం లేదు?
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే కొందరు వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రులతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు ఏం చేస్తున్నారు?

బాధితుడి ఫిర్యాదు అనంతరం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Q News — పేదల సమస్యలపై ప్రశ్నిస్తూ, ఆరోపణలు వచ్చిన ప్రతి అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కొనసాగిస్తుంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!