చీకటి వెలుగు నల్లగొండ:
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని నల్గొండ జిల్లా కలెక్టర్ B. Chandrasekhar బి. చంద్రశేఖర్ అన్నారు.
పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, కొత్త విద్యా సంవత్సరానికి తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు సోమవారం నుంచి ప్రారంభమైనట్లు తెలిపారు. విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉందన్నారు.
పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే విద్యార్థులకు కొత్త యూనిఫాంలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో మూతపడిన కొన్ని ప్రాథమిక పాఠశాలలను తిరిగి ప్రారంభించాలంటూ సర్పంచుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే పాఠశాలలు, హాస్టళ్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, పాఠశాల యాజమాన్యం, స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments