రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తోందని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా పావలా వడ్డీ రుణాలను అందజేస్తూ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఇప్పటికే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో నల్గొండ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
అన్ని డివిజన్లలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరలు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు చేపడుతున్నామని మేయర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు, కార్పొరేటర్ కౌసర్, కార్పొరేటర్ గంట్ల అనంతరెడ్డి, కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, ఏడుదొడ్ల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments