ePaper
Monday, May 4, 2026

విజయ డెయిరీ పాల ఉత్పత్తులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ, సోమవారం:

ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ అందిస్తున్న కల్తీ లేని పాల ఉత్పత్తులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

సోమవారం నగరంలోని రవీందర్ నగర్ ప్రాంతంలో, ప్రసాద్ ఉడిపి హోటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన విజయ తెలంగాణ డెయిరీ మిల్క్ పార్లర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేయర్, విజయ డెయిరీ నాణ్యమైన మరియు విశ్వసనీయమైన పాల ఉత్పత్తులను తక్కువ ధరలకు ప్రజలకు అందిస్తున్నదని తెలిపారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాలు, నెయ్యి, పెరుగు, బాదం మిల్క్, పనీర్, ఐస్‌క్రీమ్, కోవా, వాటర్ బాటిళ్లు, కీర్ మిక్స్, మిల్క్ కేక్, బట్టర్ మిల్క్, ఫుల్ క్రీం పాలు, టెట్రా ప్యాక్ పాలు తదితర ఉత్పత్తులను ప్రభుత్వం సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. కల్తీ లేని ఆహార ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండగలరని సూచించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామగిరి అఖిల్ రావు, ఆల్లి సుభాష్ యాదవ్, ఆల్లి మల్లికార్జున్ యాదవ్ పాల్గొన్నారు. అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్, విజయ డెయిరీ నల్గొండ జిల్లా డిస్ట్రిబ్యూటర్ వి. రాజేంద్రప్రసాద్, ప్రోప్రైటర్ పి. సాయికుమార్ హాజరయ్యారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!